SBI New Charges: జులై 1 నుంచి సామాన్యుడిపై ప్రభావం చూపే 5 కొత్త రూల్స్ ఇవే

SBI New Charges From July 1: మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలలో ఈ సమస్య అధికంగా ఉంటుంది ఈ క్రమంలో జులై 1 నుంచి సామాన్యులతో పాటు అందరూ గుర్తుంచుకోవాల్సిన కొత్త నియమాలు ఇక్కడ అందిస్తున్నాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 30, 2021, 08:55 AM IST
SBI New Charges: జులై 1 నుంచి సామాన్యుడిపై ప్రభావం చూపే 5 కొత్త రూల్స్ ఇవే

Income Tax Rules to SBI New Charges:  కొత్త నెల ప్రారంభం అవుతుంటే చాలు, ఆ నెలకు బడ్జెట్ ఎలా అంచనా వేసుకోవాలి. ఖర్చులకు డబ్బు సరిపోతుందా, లేదా ఇంకేమైన కొత్త మార్పులు ప్రభుత్వం తీసుకొచ్చిందా అనే ఆందోళన సామాన్యుడికి ఉంటుంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలలో ఈ సమస్య అధికంగా ఉంటుంది ఈ క్రమంలో జులై 1 నుంచి సామాన్యులతో పాటు అందరూ గుర్తుంచుకోవాల్సిన కొత్త నియమాలు ఇక్కడ అందిస్తున్నాం. 

- ఎస్‌బీఐ ఏటీఎం ఛార్జీలు
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్ ఉచిత ట్రాన్సాక్షన్‌లలో మార్పులు చేసింది. గతంలో 5 లావాదేవిలు ఉచితంగా అందించగా, జులై 1 నుంచి వీటి సంఖ్యను 4కు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. సేవింగ్స్ బ్యాక్ అకౌంట్ హోల్డర్స్‌కు ఇవి వర్తించనున్నాయి. బ్యాంకులు మరియు ఏటీఎంలలో 5వ ట్రాన్సాక్షన్ నుంచి మీరు అదనంగా రూ.15తో పాటు జీఎస్టీ (Goods and Services Tax) వసూలు చేస్తారు.

Also Read: Bank Holidays In July 2021: జులై నెలలో 15 రోజులపాటు బ్యాంకులు బంద్, మీ బ్యాంక్ పనులు షెడ్యూల్ చేసుకోండి

- ఎస్‌బీఐ చెక్ బుక్ ఛార్జీలు
బేసిక్ సేవింగ్ అకౌంట్ కలిగిఉన్న ఖాతాదారులకు ఓ ఆర్థిక సంవత్సరానికిగానూ కేవలం 10 చెక్కులు మాత్రమే ఉచితంగా అందిస్తూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. 11 చెక్కు తరువాత అదనంగా రూ.40 మరియు జీఎస్టీ వసూలు చేస్తారు. 25 చెక్కుల నుంచి రూ.75 మరియు దానిపై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. 

- ఎల్‌పీజీ సిలిండర్ ధరలు (LPG Cylinder Price)
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్ ధరలు జులై 2021లో మరోసారి పెరగనున్నాయి. ప్రతినెలా ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరలు సవరిస్తోంది. అయితే కొన్ని సందర్భాలలో ధరలు యథాతథంగా ఉంచే అవకాశాలు సైతం ఉన్నాయి.

Also Read: EPFO Benefits: ఈపీఎఫ్ ఖాతాలున్నాయా, అయితే ఈ 5 EPF బెనిఫిట్స్ తెలుసుకోండి

- ట్యాక్స్ మార్పులు
ఆదాయపు పన్ను శాఖ అధిక పన్ను ఛార్జీలు వసూలు చేయనుంది. గత రెండేళ్లుగా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయని వారిపై ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ (TDS) నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయనున్నారు. కనుక ప్రతి ఏడాది నిర్ణీత సమయంలో పన్ను చెల్లించడం ఉత్తమం.

- ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మార్పు
కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ విలీనం కావడం తెలిసిందే. గత ఏడాది బ్యాంకులు విలీనం కాగా, జులై 2021 నుంచి పాత బ్యాంకుల ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మారుతుంది. కెనరా బ్యాంకు కస్టమర్ కేర్‌కు కాల్ చేసి కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్ పొందాలని ఖాతాదారులకు సూచించారు. 

Also Read: SBI New Charges: కస్టమర్లకు ఎస్‌బీఐ షాక్, జులై 1 నుంచి కొత్త ఛార్జీలు వసూలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News